Bulli Raju: బుల్లి రాజు ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లడం గ్యారెంటీ
గతేడాది సంక్రాంతి పండుగకు రిలీజైన విక్టరీ వెంకటేష్(venkatesh) సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam) సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన వారిలో బుల్లి రాజు(Bulli Raju)గా నటించిన రేవంత్ భీమల(Revanth Bheemala) కూడా ఉన్నాడు. వెంకీ కొడుకు బుల్లి రాజు క్యారెక్టర్ లో రేవంత్ చూపించిన ఎనర్జీకి, ఆ యాక్టింగ్ కు ఆడియన్స్ బాగా ఎట్రాక్ట్ అయ్యారు.
సంక్రాంతికి వస్తున్నాంతో రేవంత్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అతనికి అవకాశాలు కూడా బాగా వచ్చాయి. వచ్చిన అవకాశాలను అందుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్న రేవంత్, ఈ సంక్రాంతికి ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. వాటిలో ఒకటి అనిల్ రావిపూడి(Anil ravipudi)- చిరంజీవి(Chiranjeevi) కాంబినేషన్లో వస్తున్న మన శంకరవరప్రసాద్(Mana Shankaravaraprasad Garu) కాగా, రెండోది నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరోగా వస్తున్న అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju).
ఈ రెండు సినిమాల్లో రేవంత్ కీలక పాత్రల్లో నటించాడు. మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో బుల్లిరాజు తరహా లెంగ్తీ క్యారెక్టర్ కాకపోయినా థియేటర్లలో రేవంత్ కనిపించగానే అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయం. పైగా చిరూ- రేవంత్ కాంబినేషన్ సీన్స్ బాగా వచ్చాయని అనిల్ ఇప్పటికే చెప్పాడు. ఇక నవీన్ సినిమాలో కూడా రేవంత్ కు మంచి క్యారెక్టర్ పడిందని తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాతో ఈ పిల్లాడు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి.






