CBN: పీబీ సిద్ధార్ధ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
⦁ ఆంధ్రప్రదేశ్ లో అత్యుత్తమ విద్యా సంస్థగా సిద్ధార్ధ అకాడమీ పేరు తెచ్చుకుంది
⦁ లక్షల మంది విద్యార్ధులను తీర్చిదిద్దిన సంస్థగా పేరు ప్రఖ్యాతులను ఈ సంస్థ ఆర్జించింది
⦁ విజయవాడను విద్యల వాడ మార్చటంలో ఈ సంస్థ చేసిన కృషి అభినందనీయం
⦁ సిల్వర్ జూబ్లీతో పాటు గోల్డెన్ జూబ్లీ వేడుకలకు కూడా నేను హాజరుకావటం అదృష్టంగా భావిస్తున్నాను
⦁ ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఎడ్, హోటల్ మేనేజ్మెంట్, ఫార్మసీ సహా 18 కళాశాలల ద్వారా 28 వేల మంది విద్యార్ధులను తీర్చిదిద్దుతున్నారు
⦁ విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సిద్ధార్ధ అకాడమీకి అభినందనలు తెలియచేస్తున్నాను
⦁ సిద్ధార్ధ అకాడమీ సంస్థలు అగ్రిటెక్ కళాశాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది
⦁ ఎలాంటి ప్రయోజనం, పరిహారం కోరకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజికి భవనాలు ఇచ్చిన సిద్ధార్ధ అకాడమీకి ధన్యవాదాలు
⦁ సిద్ధార్ద విద్యాసంస్థలు నిర్మించిన కళాశాల భవనాలను యూనివర్సిటీగా ఎన్టీఆర్ తీర్చిదిద్దారు.
⦁ మెగా పేరెంట్ టీచర్ ద్వారా తల్లితండ్రులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులతో ఏడాదికి రెండు మార్లు సమావేశాన్ని నిర్వహిస్తున్నాం
⦁ విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
⦁ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు తీసుకురావటం ద్వారా మన వద్దే నైపుణ్యాలు పెంచేలా కృషి చేస్తున్నాం
⦁ ప్రైవేటు రంగంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కూడా అమరావతిలో ఉన్నాయి
⦁ ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్ లను కూడా అమరావతిలో ఏర్పాటు చేయించాలని సంకల్పించాం
⦁ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది.
⦁ కేంద్రం క్వాంటం మిషన్ ప్రకటిస్తే.. వెంటనే అందిపుచ్చుకుని క్వాంటం కంప్యూటర్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం
⦁ ఆరు నెలల్లోనే క్వాంటం కంప్యూటర్ అమరావతి నుంచి పనిచేయటం ప్రారంభిస్తుంది
⦁ క్వాంటం అల్గారిథమ్స్ నేర్పేందుకు కూడా విద్యార్ధులకు, నిపుణులకు కోర్సులు నిర్వహిస్తున్నాం
⦁ ప్రపంచం మెచ్చే అమరావతి రాజధాని నిర్మించబోతున్నాం
⦁ కొందరు ఈ నిర్మాణ వేగాన్ని చూసి ఆసూయ చెందుతున్నారు. అమరావతిని ఆపేస్తామని కలలు కంటున్నారు
⦁ అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని ఆరోపణలు చేస్తున్నారు
⦁ రాజమండ్రి, విశాఖ, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, లండన్ నగరాలు ఎక్కడున్నాయో వారు చెప్పాలి
⦁ ఎక్కడ నీరుంటే అక్కడ నాగరికతలు వెలుస్తాయి. ఈ విషయం తెలియని వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు
⦁ పవిత్ర జలాలు, మట్టితో అమరావతి ప్రజా రాజధాని పవిత్రం చేశాం. ఇది అన్ స్టాపబుల్
⦁ విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి అన్నీ కలిసి పోయి ఒక బెస్ట్ లివబుల్ సిటిగా తయారవుతుంది
⦁ వికసిత్ భారత్ లో భాగంగా 2047కు స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నాం.
⦁ భారత్ నెంబర్ వన్ అవుతుంది. ఏపీతో పాటు తెలుగు జాతి కూడా అగ్రస్థానానికి వెళ్లటాన్ని ఎవరూ ఆపలేరు
⦁ గతంలో ఐటీని ప్రోత్సహించాం. ఇప్పుడు ఏఐ, క్వాంటం ను ప్రోత్సహిస్తున్నాం
⦁ క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంతో పాటు నాలుగేళ్లలో క్వాంటం కంప్యూటర్ల తయారీ కూడా చేయబోతున్నాం
⦁ తిరుపతిలో స్పేస్ సిటీ కోసం రెండు శాటిలైట్ కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి
⦁ కర్నూలులో డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ ఎక్విప్మెంట్, డిఫెన్స్, సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏపీలో వస్తున్నాయి
⦁ టెక్నాలజీ ద్వారా పాలన, పౌర సేవలు అందించటంతో పాటు సంజీవని ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నాం






