Sree Leela: చీరలో చూడముచ్చటగా శ్రీలీల
టాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల(Sree Leela) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆల్రెడీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీలీల ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. లీలమ్మ నటించిన తాజా సినిమా పరాశక్తి(Parasakthi) రిలీజ్ కు రెడీ అవుతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు ముస్తాబవుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా పరాశక్తి ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రీలీల బ్లాక్ శారీ, జడలో గులాబీ పువ్వు పెట్టుకుని మరింత అందంగా కనిపిస్తూ అందరినీ తన అందంతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోల్లో శ్రీలీల చూడ ముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.






