Srinivasa Mangapuram: జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
ఘట్టమనేని కుటుంబం నుంచి సరికొత్త స్టార్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అతని మొదటి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’కు RX 100, మంగళవారం లాంటి మరపురాని సినిమాని అందించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్ పై పి. కిరణ్ నిర్మించారు. ఈ చిత్రం టైటిల్, ప్రీ-లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్న కొడుకైన జయ కృష్ణ తొలి చిత్రం పవర్ ఫుల్ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో జయ కృష్ణ దుమ్ము దూళి ఎగసే రగ్గడ్ బ్యాక్ డ్రాప్ లో హై స్పీడ్‌లో బైక్ నడుపుతూ కనిపించారు. ఒక చేత్తో బైక్‌ను గట్టిగా పట్టుకుని, మరో చేత్తో గన్ టార్గెట్ గా పెట్టిన విధానం హై-స్టేక్స్ చేజ్‌ను సూచిస్తోంది. చుట్టూ మోషన్ బ్లర్, అతని కళ్లలో కనిపించే ఫోకస్..మొత్తం లుక్కు పవర్, ఇంటెన్సిటీని యాడ్ చేస్తోంది. ఈ సినిమాను టీమ్ “డెబ్యూ ఆఫ్ ది ఇయర్ 2026”గా బ్రాండ్ చేస్తోంది. మొత్తంమీద ఫస్ట్ లుక్ ఒక గ్రిప్పింగ్, హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాని ప్రామిస్ చేస్తోంది.
షూటింగ్ ప్రారంభానికి ముందు జయ కృష్ణ తన పాత్ర కోసం ఇంటెన్స్ ప్రిపరేషన్ చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రాషా తడాని టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు.
టాలీవుడ్లో అద్భుతమైన స్టార్ లాంచ్‌లకు చిరునామాగా నిలిచిన అశ్వినీ దత్, ఈసారి జయ కృష్ణ ఘట్టమనేని రూపంలో మరో కొత్త స్టార్‌ను పరిచయం చేస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, జయకృష్ణ ISC కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. మాధవ్ కుమార్ గుల్లపాటి ఎడిటర్. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్. రియల్ సతీష్ ఫైట్ మాస్టర్.






