Home Minister Anitha: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం: హోంమంత్రి అనిత
గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ జరగలేదని, కూటమి ప్రభుత్వం రాగానే 6 వేల కానిస్టేబుల్ (Constable) పోస్టులు భర్తీ చేయడంతోపాటు స్టైపెండ్‌ను కూడా మూడింతలు పెంచామని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. నెల్లూరు (Nellore)కు వచ్చిన హోంమంత్రి కేంద్ర కారాగారాన్ని తనిఖీ చేశారు. జైలులో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు, వారికి అందిస్తున్న భోజనాలను పరిశీలించారు. జైలులో వసతుల కల్పనపై ఖైదీలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ సహించేది లేదని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రతి ఏడాది పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని, అందులోనే జైళ్లు, అగ్నిమాపక శాఖల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






