TFAS: గుంటూరులో శ్రీ నారాయణ తీర్థుల తరంగిణి మహోత్సవం
గుంటూరు నగరంలో శనివారం జనవరి 10వ తేదీన శ్రీ నారాయణ తీర్థుల వారిని స్మరిస్తూ కృష్ణ లీలా తరంగిణి కార్యక్రమం ఘనంగా జరగనుంది. తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (న్యూజెర్సీ), శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
లక్ష్మీపురం మెయిన్ రోడ్డులోని శ్రీ త్యాగరాజ కళా వేదికపై సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు వివిధ సంగీత, నృత్య పాఠశాలల విద్యార్థులచే ప్రదర్శనలు ఉండనున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ అధికారి బి.వి. రమణ కుమార్, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. ఉదయ లక్ష్మి, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. కార్యక్రమం అనంతరం అల్పాహారం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు.






