Chicago: చికాగోలో అటిజం, సెరిబ్రల్ పాల్సీపై వైద్య సెమినార్
చికాగో: అటిజం, సెరిబ్రల్ పాల్సీ వంటి నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో వస్తున్న అధునాతన మార్పులపై అవగాహన కల్పించేందుకు చికాగోలో ఒక ప్రత్యేక వైద్య సెమినార్ నిర్వహించనున్నారు. న్యూరోజెన్ బ్రెయిన్ అండ్ స్పైన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
తేదీ, సమయం: 11 జనవరి 2026, ఆదివారం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు.
వేదిక: హనుమాన్ మందిర్ బేస్మెంట్, 3623 డబ్ల్యూ లేక్ ఏవెన్యూ, గ్లెన్వ్యూ, చికాగో, అమెరికా.
ప్రధాన వక్త: ముంబయికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్, న్యూరోజెన్ బీఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ అలోక్ శర్మ ఈ సెమినార్లో ప్రసంగిస్తారు.
సెమినార్ ఉద్దేశ్యం: అటిజం, సెరిబ్రల్ పాల్సీతో పాటు ఇంటలెక్చువల్ డిజబిలిటీ, మస్క్యులర్ డిస్ట్రోఫీ, వెన్నెముక గాయాల వంటి ఇతర నాడీ సంబంధిత సమస్యల నిర్వహణలో అందుబాటులోకి వచ్చిన సరికొత్త వైద్య విధానాల గురించి డాక్టర్ అలోక్ శర్మ వివరించనున్నారు. ఈ ప్రసంగం అనంతరం బాధితులు, వారి కుటుంబ సభ్యుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా ప్రశ్నోత్తరాల సమయం కూడా కేటాయించారు. ఈ సెమినార్కు ప్రవేశం పూర్తిగా ఉచితం. ఆసక్తి కలిగిన వారు చిత్రంలో ఉన్న క్యూఆర్ కోడ్ (QR code) ద్వారా లేదా +91 98192 48970 / +91 98192 48205 నంబర్లను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం contact@neurogenbsi.com కు ఈమెయిల్ చేయవచ్చు.






