Davos: దావోస్ సదస్సులో ఏఐ, లైఫ్ సైన్సెస్ పాలసీల ఆవిష్కరణ: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఏఐ, లైఫ్ సైన్సెస్ పాలసీలను ఈ నెల 19వ తేదీన దావోస్‌లో(Davos) జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ పైవ్రేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ దావోస్ సదస్సులో ఏఐ, లైఫ్ సైన్సెస్ పాలసీలను సీఎం ఆవిష్కరిస్తారని తెలిపారు. ఎఫ్‌డీఐ అప్రూవల్ ఉన్న లైఫ్‌సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్‌లో 200కుపైగా ఉన్నట్లు తెలిపారు. ఫార్మా ఎకో సిస్టమ్‌లో బోస్టన్, శాన్ఫ్రాన్సిస్కో (San Francisco), జపాన్ తర్వాత హైదరాబాద్ 4వ స్థానంలో ఉన్నట్లు సీబీఆర్ఈ నివేదికలో వెల్లడించిందని గుర్తుచేశారు. 2030 నాటికి దాదాపు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, సుమారు 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






