Minister Ponguleti : రాష్ట్రంలో మరో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే: పొంగులేటి
రాష్ట్రంలో మూడు విడతలుగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem ) జిల్లా ఇల్లెందు పట్టణంలో రూ. 2.37 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కాంగ్రెస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని, మరో ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుదని తెలిపారు. మునిసిపల్ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తోందన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






