Akhanda2: ఓటీటీలోకి వచ్చేసిన అఖండ2
బాలకృష్ణ(balakrishna) హీరోగా బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా అఖండ2 తాండవం(AKhanda2 thandavam). అఖండ(Akhanda) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా అవడంతో పాటూ బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఎన్నో అంచనాల మధ్య అఖండ2 గతేడాది డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
భారీ అంచనాలతో రిలీజైన అఖండ2 మిక్డ్స్ టాక్ తెచ్చుకుని అందరి అంచనాలను అందుకోలేకపోయింది. సినిమాలో బాలయ్య యాక్టింగ్, కొన్ని సీన్స్ బావున్నప్పటికీ అవేవీ అఖండ2 బ్లాక్ బస్టర్ గా నిలపలేకపోయాయి. అయినప్పటికీ ఈ సినిమాకు ఓపెనింగ్స్, బీ, సీ సెంటర్లలో బాగానే కలెక్షన్లు వచ్చాయి. థియేటర్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
అఖండ2 డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ రేటుకు సొంతం చేసుకోగా, ఇవాళ నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో అఖండ2 మూవీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్సే వస్తుంది. థియేటర్లలో అఖండ2ను మిస్ అయిన వాళ్లతో పాటూ సంక్రాంతి సెలవులు కూడా ఉండటంతో ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాను చూసే అవకాశముంది. మరి అఖండ2 ఓటీటీలో అయినా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందేమో చూడాలి.






