Godrej: నేటి తరం డిజైన్-ఫార్వర్డ్ గృహాలకు అనుగుణంగా భారతదేశపు తొలి రిఫ్రిజిరేటర్‌ను తీర్చిదిద్దిన గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్
~ నిరాటంకమైన వంపు తిరిగిన డోర్ డిజైన్, అధునాతన టెక్ ఫీచర్లు మరియు హ్యాండిల్‌పైనే టచ్ కంట్రోల్స్ ఉండే భారతదేశపు తొలి డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ల ఆవిష్కరణ
ముంబై: భారతీయ గృహాలు వ్యక్తిగత అభిరుచులను ప్రతిబింబించే వేదికలుగా మారుతున్నాయి. డిజైన్, నవీనత, సౌకర్యం మధ్య చక్కని సమతూకంతో ఉండే గృహోపకరణాలను వినియోగదారులు ఎంచుకుంటున్నారు. స్టయిల్‌గా ఉంటూనే అవసరాలకు తగ్గట్లు పనిచేసే ఉపకరణాలను అందించేలా గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్‌లో భాగమైన అప్లయెన్సెస్ వ్యాపార విభాగం కొత్తగా ఇయాన్ ఇన్స్పైర్ (Eon Inspire) మరియు ఎడ్జ్ ఇంప్రెస్ (Edge Impress) పేరిట ఫ్రాస్ట్ ఫ్రీ మరియు డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. కాలాతీతమైన డిజైన్ మరియు శక్తివంతమైన అధునాతన టెక్నాలజీల దన్ను, నిరాటంకమైన ఫ్లూయిడ్ కర్వ్డ్ డోర్‌తో ఈ శ్రేణి చూపు మరల్చుకోనివ్వని విధంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. 1958లో బ్రాండు తొలిసారిగా భారత్‌లో తయారుచేసిన రిఫ్రిజిరేటరుకు ఇది కొనసాగింపుగా తీర్చిదిద్దబడింది. డోర్ హ్యాండిల్‌పైనే టచ్ కంట్రోల్ కూడా ఉన్న భారతదేశపు తొలి డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లు కూడా కొన్ని ఈ శ్రేణిలో భాగంగా ఉన్నాయి.
నిత్యావసరమైన మారిన రిఫ్రిజిరేటరును, ఇంటి యజమాని వ్యక్తిత్వం మరియు అభిరుచిని ప్రతిబింబిచే ఉపకరణంగా, ఇంటిలో ఒక డిజైన్ ఎలిమెంటుగా మార్చేందుకు కొత్త శ్రేణి తోడ్పడనుంది. నిలువు గీతలు, ప్రామాణిక ఆకృతుల స్థానంలో మినిమలిస్ట్ మరియు నిరాటంకమైన వంపు తిరిగిన డోర్ డిజైన్‌తో ఈ రిఫ్రిజిరేటర్లు ఎంతో విశిష్టంగా ఉంటాయి. అంతేగాకుండా ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన ఫ్లోరల్ డిజైన్లు చూడగానే తాజా అనుభూతిని కలిగిస్తాయి. విస్తృత స్థాయిలో ఉండే ఇంటి డెకోర్కి అనుగుణమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఒక్కో రంగు ఎంచుకోబడింది. తద్వారా తమ ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసే రిఫ్రిజిరేటర్‌ను వినియోగదారులు ఎంచుకునేందుకు వీలుంటుంది. 194 లీటర్ల నుంచి 330 లీటర్ల వరకు సామర్థ్యంతో ఇవి లభిస్తాయి. ఆధునికత సౌందర్యం ఉట్టిపడుతూనే అధునాతన టెక్నాలజీ ఫీచర్లు వీటిలో ఉంటాయి. పరిశ్రమలోనే తొలిసారిగా హ్యాండిల్‌పైనే ఏర్పాటు చేసిన డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ అనేది డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్‌కి మరిన్ని సాంకేతిక హంగులను జోడిస్తుంది. హ్యాండిల్‌లోనే అమర్చిన పల్చని, నీటి నిరోధకత కలిగిన ఇంటర్ఫేస్తో యూజర్లు ఉష్ణోగ్రతలను సరి చేసుకోవచ్చు, వివిధ మోడ్‌లను యాక్టివేట్ చేయొచ్చు. సౌకర్యవంతమైన ఈ ఫీచరు మరింత నియంత్రణను అందిస్తుంది.
“ఇయాన్ ఇన్స్పైర్ మరియు ఎడ్జ్ ఇంప్రెస్ల ద్వారా కస్టమర్లకు రోజువారీ జీవితం మరింత సౌకర్యవంతంగా, సరళతరంగా చేయడమనేది మా లక్ష్యం. హ్యాండిల్‌పై గల కంట్రోల్స్ మొదలుకుని మారే అవసరాలకు అనుగుణమైన ఫీచర్ల వరకు ఈ రిఫ్రిజిరేటర్లు సౌకర్యవంతంగా ఉంటూ, స్మార్ట్ కూలింగ్‌ని, ఆధునిక గృహాలకు విశిష్టమైన అనుభూతిని అందిస్తాయి” అని గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ ప్రోడక్ట్ గ్రూప్ హెడ్ – రిఫ్రిజిరేటర్స్ ఎట్ అప్లయెన్సెస్ బిజినెస్ అనూప్ భార్గవ (Anup Bhargava, Product Group Head – Refrigerators at Appliances business of Godrej Enterprises Group) తెలిపారు.
“చూడచక్కగా ఉంటూ, ఆధునిక అనుభూతినిస్తూ, జీవితాన్ని సులభతరం చేసే ఉపకరణాలను ప్రజలు కోరుకుంటున్నారు. మేము మా తొలి రిఫ్రిజిరేటర్ యొక్క మూలాల్లోకి వెళ్లి, నేటి తరపు గృహాలకు అనుగుణంగా ఇయాన్ ఇన్స్పైర్ మరియు ఎడ్జ్ ఇంప్రెస్లను తీర్చిదిద్దాం. మినిమలిస్టిక్‌గా, చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటూ, ఉపయోగించడాన్ని సులభతరం చేసే అధునాతన టెక్నాలజీతో ఈ ఉత్పత్తులు తీర్చిదిద్దబడ్డాయి” అని గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ హెడ్ ఆఫ్ డిజైన్ ఎట్ అప్లయెన్సెస్ బిజినెస్ కమల్ పండిట్ (Kamal Pandit, Head of Design at Appliances business of Godrej Enterprises Group) తెలిపారు.
దిగ్గజ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, దేశవ్యాప్తంగా స్టోర్స్లోను ఈ శ్రేణి లభిస్తుంది. ధర రూ. 29,000 నుంచి రూ. 56,000 వరకు ఉంటుంది.






