Baa Baa Black Sheep: హీరో శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల
ఒక రోజు జరిగిన అనుకోని ఓ ఘటనతో 6 వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ స్టార్ హీరో శర్వానంద్ విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
టీజర్‌ను గమనిస్తే.. చుట్టూ పచ్చదనం, కొండలున్న అందమైన ఊరిని చూపిస్తారు. ‘చెప్పుకోడానికి ఇది మామూలు కథ కాదు. అండ పిండ బ్రహ్మాండాలను కూడా అల్లాడించే కథ’ అనే డైలాగ్ వినిపిస్తే , దానికి తగ్గట్లుగా ‘ఏం చెప్పాలనుకుంటున్నారో కాస్త క్లారిటీగా చెప్పవా’ అనే మరో డైలాగ్ వినిపిస్తుంది. ఈ గ్యాప్‌లో కొన్ని సీన్స్ కొంత మంది గన్స్‌తో కనిపిస్తారు. సినిమా ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన అక్షయ్ ఈవెంట్లో చెఫ్ లుక్‌లో కనిపిస్తాడు. అప్పుడే మనకు మరో మెయిన్ క్యారెక్టర్ విష్ణు ఎంట్రీ కనిపిస్తుంది. విష్ణు దగ్గరకెళ్లి ఈవెనింగ్ మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశా మామ అని అంటాడు.
గన్ ఫైరింగ్, కార్ చేజింగ్ వంటి ఎంగేజింగ్ సీన్స్ ను చూపిస్తారు. విష్ణు మాట్లాడుతూ ‘పోలీసులు మన వెంట ఎందుకొస్తున్నారా?..వాళ్లని కూడా ఇన్వైట్ చేశావా?’ అని టెన్షన్ పడుతుంటాడు. ఈ క్రమంలోనే జాన్ షెల్లీ హిట్లర్ అనే డాన్ పాత్రలో ఉపేంద్ర లిమాయే ఎంట్రీ ఉంటుంది. తను పెళ్లిలోకి వచ్చి అక్షయ్, విష్ణులను కొట్టి ‘మీరు దొబ్బేసిన బాక్స్ అండ్ గన్ ఎక్కడ.. నా దగ్గర కొట్టేసిన బాక్స్ ఎవరికి అమ్మేశారు?’ అని అడుగుతాడు. అక్కడ నుంచి టినూ ఆనంద్, జార్జ్ మరియన్, రాజా రవీంద్ర, విస్మయ శ్రీ తదితరులకు సంబంధించిన పాత్రలను పరిచయం చేశారు.
టీజర్ చూస్తుంటే…డిఫరెంట్ కామెడీ, బ్యూటీఫుల్ లోకేషన్స్‌లో ‘బా బా బ్లాక్ షీప్’ చిత్రాన్ని రూపొందించారని టీజర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. మూవీ ఓ బాక్స్, గన్ చుట్టూ తిరిగుతుందని అర్థమవుతుంది. ఇంతకీ ఆ గన్ కోసం మాఫియా డాన్ ఎందుకు వెతుకుతుంటాడు. చివరకు ఆ బాక్స్ ఎవరి దగ్గర ఉంటుంది.. ఆ బాక్స్‌లో ఏముంటుందనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు నిర్మాత వేణు దోనేపూడి.
ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘సినిమా మొత్తాన్ని మేఘాలయా రాష్ట్రంలో లోనే పూర్తి చేశాం. చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లోనూ చిత్రీకరించాం. మేఘాలయాలో మొత్తం సినిమా షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా ‘బా బా బ్లాక్ షీప్’. అతి తక్కువ రోజుల్లోనే పక్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. మా డైరెక్టర్ గుణి, నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా ఎంటైర్ టీమ్ సహకారంతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.
అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయగా, స్టీఫెన్, ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు.






