Minister Savita: జగన్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు: మంత్రి సవిత
వైసీపీ (YCP)కి ప్రజలెప్పుడో పాడె కట్టేశారు అని మంత్రి సవిత (Minister Savita) వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రాతూరులో టీడీపీ సీనియర్ నేత కొమ్మారెడ్డి కిరణ్ (Kommireddy Kiran) ఏర్పాటు చేసిన లోకేశ్ జన్మదిన వేడుకల్లో మంత్రి పాలొన్నారు. భారీ కేక్ కట్ చేసి పేదలకు చీరలు, విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జగన్ (Jagan) శవయాత్ర చేసినా ప్రజలు పట్టించుకోరు. మంత్రి లోకేశ్‌ను చూస్తే జగన్‌కు వెన్నులో వణుకు అని వ్యాఖ్యానించారు. అరెస్టు భయంతో జగన్ డైవర్షన్ రాజకీయాలకు కొత్త డ్రామా మొదలు పెట్టారు. పాదయాత్ర సంగతి తరువాత, జగన్ నువ్వు ముందు అసెంబ్లీ (Assembly)కి వచ్చి పులివెందుల సమస్యలపై మాట్లాడు. రాష్ట్రాభివృద్ధిలో మంత్రి లోకేశ్ పాత్ర గణనీయం. తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడుల సేకరణలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టారు. జగన్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయింది అని మంత్రి విమర్శించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






