Godavari Pushkaralu: కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు : చంద్రబాబు
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu)ను కుంభమేళాలను తలపించేలా నిర్వహించాలని, యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. సచివాలయంలో గోదావరి పుష్కారాలపై సీఎం చంద్రబాబు తొలిసారి అత్యున్నత సమీక్ష నిర్వహించారు. ఇంకా 18 నెలల సమయం మాత్రమే ఉన్నందున, వెంటనే అన్ని శాఖలు పనులు ప్రారంభించాలని నిర్దేశించారు. దేశ, విదేశాల నుంచి 10 కోట్ల మంది పుష్కర స్నానాలకూ వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్లు వసతులు కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పోలవరం (Polavaram), ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ (Kakinada) జిల్లాల్లో 212 కి.మీ మేర గోదావరి ప్రవహిస్తున్నందున, పెద్దఎత్తున పుష్కరాలకు ఏర్పాటు ఉండాలి సీఎం పేర్కొన్నారు. ఆ ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలతోనూ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రస్తుతమున్న 234 ఘాట్లతోపాటు కొత్తగా మరో 139 ఘాట్లు కలిపి మొత్తం 373 ఘాట్లను 9,918 మీటర్ల పొడవునా అభివద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలి. రాజమహేంద్రవరంలో మోడల్ ఘాట్ నిర్మించాలి. దాని డిజైన్ల ఆధారంగా మిగిలిన ఘాట్లు నిర్మించాలి అని చంద్రబాబు చెప్పారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






