మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దీక్ష ( Deeksha) చేపట్టారు. ఏటా చేపట్టే ఆధ్యాత్మిక దీక్షను ఈసారి కూడా ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం (Lakshmi Narasimha Swamy Temple)లో అర్చనలు చేసి దీక్ష స్వీకరించారు. ప్రతి సంవత్సరం నాలుగు నెలలపాటు ఈ దీక్ష చేస్తుంటారు. గురుముఖత పొందిన మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టేందుకు ఈ దీక్షను పాటిస్తున్నారు.అంతకుముందు ఆలయ రాజగోపురం వద్ద ఈవో సునీల్‌కుమార్ (Sunil Kumar), అర్చకులు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికారు. దిగువ సన్నిధిలో స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించి అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఏపీఎంఎసఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.








