అట్లాంటాలో మే 30న ‘శ్రీ విద్య’ బోధనా కార్యక్రమం
TAMA: అట్లాంటా తెలుగు సంఘం (TAMA) , దేవీపురం సంయుక్త ఆధ్వర్యంలో పవిత్రమైన ‘శ్రీ విద్య ఉపాసన’పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బోధనా కార్యక్రమాన్ని (Sri Vidya Teaching Tour) నిర్వహిస్తున్నారు. గురూజీ అమృతానంద నాథ సరస్వతి కుమార్తెలు , ప్రధాన శిష్యులైన రాధా మర్థి, రమ కందర్ప ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
కార్యక్రమ విశేషాలు..
- తేదీ: మే 30, శనివారం.
- సమయం: సాయంత్రం 4:00 నుండి రాత్రి 7:00 గంటల వరకు.
- వేదిక: షిర్డీ సాయి టెంపుల్, 700 జేమ్స్ బర్గెస్ రోడ్, సువానీ (GA).
ఈ సదస్సులో పాల్గొనే భక్తులు ప్రపంచంలోనే ఏకైక శ్రీచక్ర దేవాలయమైన ‘దేవీపురం’ గురించి, అలాగే శ్రీవిద్య, శ్రీచక్రం ప్రాముఖ్యత గురించి తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో ‘గ్రూప్ కళావాహన’ (Group Kalavahana) అనే అరుదైన విశిష్ట క్రతువు నిర్వహించనున్నారు. జీవితమే అత్యున్నతమైన ఆరాధన అని, మన శరీరమే శ్రీచక్రమని చాటిచెప్పే ఈ ప్రాచీన జ్ఞానాన్ని నేటి సమాజానికి ఉపయోగపడేలా బోధించనున్నారు.
సంప్రదించాల్సింది..
ఆసక్తి గల వారు నమోదు కోసం tama.org/srividyaupasana వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా ఈ క్రింది వారిని సంప్రదించవచ్చు.
పార్వతి కొంపెల్ల: (561) 359-4041
ప్రియ బాలుసు: (404) 993-0043
సునీత పొట్నూరు (TAMA ప్రెసిడెంట్): 404-988-9429
మధుకర్ యార్లగడ్డ (చైర్మన్): (913) 609-3563
ఆధ్యాత్మిక చింతన కలిగిన తెలుగు వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని TAMA ప్రతినిధులు కోరారు.
ఇవి కూడా చదవండి






