డెలావేర్లో ‘ఆటా’ మహాసభల సన్నాహక సదస్సు.. కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ వేడుకలు గ్రాండ్ సక్సెస్
ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ మహాసభల సందడి మొదలైంది. మే 16, 2026న డెలావేర్‌లోని విల్మింగ్టన్ నగరంలో గల డబుల్ ట్రీ హోటల్లో ఆటా బోర్డు సమావేశం , కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అమెరికా నలుమూలల నుండి ఆటా బోర్డు సభ్యులు, మాజీ అధ్యక్షులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అట్టహాసంగా కిక్ ఆఫ్ వేడుకలు..
మే 15న ఏర్పాటు చేసిన స్వాగత విందుతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు, మే 16 సాయంత్రం నిర్వహించిన ‘కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ , ఫండ్‌రైజింగ్ డిన్నర్ గాలా’తో ముగిశాయి. ఈ వేడుకలో సుమారు 400 మందికి పైగా అతిథులు పాల్గొని మహాసభల విజయానికి తమ మద్దతును ప్రకటించారు.

కీలక చర్చలు..
బోర్డు సమావేశంలో ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ప్రెసిడెంట్ రిపోర్ట్‌ను సమర్పించారు. ఇందులో భాగంగా మహిళా దినోత్సవ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు , కాన్ఫరెన్స్ నిధుల సేకరణపై చర్చించారు. సంస్థ ఆర్థికంగా పటిష్టంగా ఉందని ట్రెజరర్ తన నివేదికలో పేర్కొన్నారు. రాబోయే బాల్టిమోర్ మహాసభల కోసం ఏర్పాటు చేసిన యూత్, కల్చరల్, ఉమెన్స్, రిసెప్షన్, మ్యాట్రిమోనీ, వెన్యూ , రిజిస్ట్రేషన్ వంటి వివిధ కమిటీలు తమ పురోగతిని బోర్డుకు వివరించాయి.

మహాసభలకు ఆహ్వానం..
బాల్టిమోర్‌లో జరగనున్న ఈ మహాసభలను అత్యంత అద్భుతంగా నిర్వహించేందుకు ఆటా బృందం అహర్నిశలు కృషి చేస్తోంది. ఆసక్తి గల వారు కింద ఉన్న లింక్ ద్వారా తమ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
రిజిస్ట్రేషన్ కోసం: https://ataconference.org/My-Account/Event-Registration
తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెప్పే ఈ మహాసభలకు తెలుగు వారందరూ తరలిరావాలని ఆటా నాయకత్వం పిలుపునిచ్చింది.







