మే 30న టాంపాలో భద్రాద్రి రామయ్య కల్యాణం.. భక్తులకు ‘మాటా’ ఆహ్వానం
MATA: మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA), హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో మే 30, 2026 శనివారం రోజు “భద్రాచల శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం” ఘనంగా జరగనుంది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాటా (MATA) కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 30, 2026 (శనివారం)
- సమయం: ఉదయం 10:00 గంటలకు (EST)
- వేదిక: హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా, టాంపా.
నిర్వాహకులు..
ఈ కార్యక్రమ సమన్వయం కోసం మాలిని రెడ్డి (330-962-4200) , జె.బి. అవుల (813-503-5985) వ్యవహరిస్తున్నారు. స్పాన్సర్షిప్ అవకాశాల కోసం కూడా జె.బి. అవుల గారిని సంప్రదించవచ్చు.
మాటా (MATA) ముఖ్య నేతలు..
ఈ కార్యక్రమానికి మేటా ప్రెసిడెంట్ రమణ కిరణ్ దుడ్డాగి నేతృత్వం వహిస్తుండగా, కన్వీనర్ శ్రీధర్ గుడాల, కో-కన్వీనర్లుగా టోనీ జన్ను , దాము గేదెల వ్యవహరిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
భక్తులు $101 (సేవార్థి) లేదా $501 (మహా సేవార్థి) చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.mata-us.org వెబ్సైట్ను సందర్శించగలరు.







