‘పెద్ది’ నుంచి రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ ఫెరోషియస్ ఫస్ట్ లుక్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మచ్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌లో చరణ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ‘పెద్ది’ని భారతీయ సినిమాకు కొత్త అనుభూతిని ఇచ్చే విజువల్ స్పెక్టకిల్‌గా రూపొందించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేయనున్నారు.
ఈలోగా మేకర్స్ మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ పోషిస్తున్న పవర్ఫుల్ పాత్ర ‘రామ్ బుజ్జి’ని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. క్రికెట్ మైదానంలో రామ్ బుజ్జి ఎంట్రీ ఇచ్చిన తీరు, అతని బాడీ లాంగ్వేజ్, రగ్గడ్ యాటిట్యూడ్ పాత్రలోని ఇంటెన్సిటీని బలంగా చూపించాయి.
దివ్యేందు శర్మ స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి వీడియోకి మాస్ వైబ్ తీసుకొచ్చాయి. దీంతో ‘రామ్ బుజ్జి’ పాత్ర సినిమా కథలో ఎంత కీలకంగా ఉండబోతోందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతున్నాయి.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ నిర్వహిస్తున్న ఈ భారీ చిత్రానికి ఇప్పటికే ఫుల్ ఎడిట్ లాక్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘పెద్ది’ జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.






