జూలై 17 నుంచి టీటీఏ సంబరాలు.. మెగా స్పాన్సర్‌గా అద్విత్రి గ్రూప్
TTA:ఉత్తర అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) మెగా కన్వెన్షన్ 2026కు ‘అద్విత్రి గ్రూప్’ (Advithri Group) మెగా స్పాన్సర్‌గా ముందుకు వచ్చింది. జూలై 17 నుండి 19 వరకు నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించేలా నిర్వహించే ఈ వేడుకకు అద్విత్రి గ్రూప్ అందిస్తున్న సహకారం పట్ల టీటీఏ బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు టీటీఏ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
వివరాలు..
- వేదిక: షార్లెట్ కన్వెన్షన్ సెంటర్, NC
- తేదీలు: జూలై 17 – 19, 2026
- టికెట్ల కోసం: www.ttaconvention.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మహాసభల పర్యవేక్షణ..
టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి కుంటియెల్లన్నగారి , ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఈ మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ కుటుంబాలందరినీ ఏకం చేస్తూ, గర్వించదగ్గ రీతిలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.సంస్కృతి, సేవే లక్ష్యంగా సాగే ఈ భారీ వేడుకలో అందరూ భాగస్వాములు కావాలని టీటీఏ కోరింది.






