కొలిక్కిరాని తానా పంచాయితీ – రెండుగా చీలిన నాయకత్వం
గత సంవత్సరం జూలై మొదటి వారంలో జరిగిన తాన మహాసభల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ దాదాపు పది నెలలు అయినా ఇప్పటివరకు బోర్డు మీటింగ్ జరప లేదని, బోర్డు చైర్మన్ ని ఎన్నుకోలేదని, ఖాళీ అయిన బోర్డ్ మెంబర్ పదవిని భర్తీ చేయలేదని, ఈ విషయాలలో అంతర్గతంగా తానా నాయకత్వంలో ఉన్న విభేదాలే కారణమని తానా సభ్యులు, శ్రేయోభిలాషులలో చాలామందికి తెలుసు. అయితే ఈ విషయాలను పక్కన పెట్టి తానా క్రమ బద్దంగా అటు అమెరికా లో, ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ చేసే సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉండటం వల్ల తానా సభ్యులు గాని శ్రేయోభిలాషులు గాని ఈ విషయంపై ఎక్కువగా ఆదుర్దా పడలేదు.
అయితే గత 10 జరుగుతున్న కొన్ని సంఘటనల వల్ల తెలుగు టైమ్స్ ఈ న్యూస్ స్టోరీ రాయాల్సి వస్తోంది.
ఒక పది రోజుల క్రితం తానా పూర్వపు బోర్డు చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి బోర్డు మీటింగ్ కి సభ్యులందరికీ పిలిచారు.
ప్రస్తుత తానా బోర్డ్ కి చైర్మన్ నియమించాల్సిన పరిస్థితిలో మాజీ చైర్మన్ ఆపద్ధర్మ చైర్మన్ గా ఉంటారని, ఆ కెపాసిటీ తోనే ఈ బోర్డు మీటింగ్ కి పిలిచారని వారు తెలిపారు. ఈ సమావేశానికి 16 మంది సభ్యులు ఉన్న తన బోర్డులో తొమ్మిది మంది హాజరయ్యారు. అయితే చైర్మన్ పదవిని చేసే అపాయింట్మెంట్ విషయంలో బోర్డు మీటింగ్ లో నిర్ణయాలు 2/3 మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాలి. అనగా 12 మంది సభ్యుల మద్దతు ఉండాలని ఆరోజు సమావేశము లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ముగించారు.
ప్రస్తుత తానా అధ్యక్షులు డాక్టర్ నవీన్ కొడాలి మాజీ చైర్మన్ కి బోర్డు మీటింగ్ పెట్టె అర్హత – అధికారం లేదని, అధ్యక్షుడిగా బోర్డు మీటింగ్ జరపబోతున్నాని సభ్యులను పిలిచారు. డాక్టర్ నరేన్ కొడాలి ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో 7 మంది మాత్రమే రావడం వలన ఆ సమావేశం కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ముగించడం జరిగింది.
డా. నరేంద్ర శ్రీనివాస్ కోడలి వర్గం మరల ఒకసారి బోర్డు సమావేశం జరపాలని నిశ్చయించుకొంది. అదే విధంగా డా. నరేన్ కోడలి వర్గం కూడా మరొక సారి బోర్డు సమావేశం నిర్వహించింది… ఆ సమావేశం లో 8 మంది పాల్గొన్నారు. ఈ సమావేశం లో కొన్ని నిర్ణయాలు కూడా చేశారు.
మొదటగా తానా తో ఎంతో అనుబంధం వుండి, అన్ని రకాల పదవులు నిర్వహించి, ఏంటో అనుభవం ఉన్న అనుభవం ఉన్న శ్రీ రవి పొట్లూరి ని తానా బోర్డు చైర్మన్ గా , తానా లో ఎప్పటి నుంచో ఉంటూ కీలక మైన పదవులు కూడా నిర్వహించిన శ్రీ వెంకట్ కోగంటి ని తానా బోర్డు ట్రెజరర్ గా నియమించాలనే నిర్ణయం తీసుకొన్నారు. తానా బోర్డు కి సెక్రటరీగా శ్రీ హేమ కానూరు పేరు ను ప్రతిపాదించగా, ఆయన సున్నితం గా తిరస్కరించినట్టు తెలిసింది. ఈ సమావేశం లోనే తానా బోర్డు మెంబెర్ గా ( ఇంతకూ ముందు సంవత్సరం తానా బోర్డు మెంబెర్ గా ఉన్న శ్రీ శ్రీనివాస్ లావు తానా సంస్థ కి ఎగ్జిక్యూటువే వైస్ ప్రెసిడెంట్ గా రావడం వలన, ఆయన పోస్ట్ ఖాళీ అయ్యింది ) శ్రీ చలపతి కొండ్రకుంట ని ప్రతిపాదించడం జరిగింది.
డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి వర్గం కూడా కూడా రెండోసారి సమావేశం అయినప్పుడు ఎనిమిది మంది మాత్రమే ఉండటం వలన కోరం లేదు అని సమావేశం ముంగిచారు. తానా బైలాస్ ప్రకారం వరుసగా మూడుసార్లు బోర్డు సమావేశాలు జరిగి, మూడు సార్లు ఏ కారణం వలన అయినా సభ్యులందరూ హాజరు కానీ పరిస్థితులలో 3 వ సారి జరిగిన మీటింగ్ లో సంపూర్ణమైన మెజారిటీ లేకపోయినా సింపుల్ మెజారిటీ తో నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే 16 మంది ఉన్న బోర్డు లో 12 మంది సభ్యుల బదులు గా 9 మంది సభ్యులతో నిర్ణయాలు తీసులోవచ్చు.
ఈ పాయింట్ ని ప్రకారం మూడు సమావేశాలు నిర్వహించి, మూడో సమావేశంలో తమ నిర్ణయాలకు చట్టబద్ధంగా ఆమోదం తెచ్చుకొందామని రెండు వర్గాలు అనుకొంటున్నాయి అని తెలుస్తోంది.
ఈ సమయంలోనే తానా పెద్దలు మాజీ అధ్యక్షులు శ్రీ జయరాం కోమటి, శ్రీ గంగాధర్ నాదెళ్ల , శ్రీ అంజయ్య చౌదరి లావు లాంటి తన పెద్దలు రంగంలోకి దిగి ఇరు వర్గాల వారితో మాట్లాడుతూ సామరస్య పూర్వకంగా ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించుకోవాలని నచ్చజెపుతున్నట్టు గా తెలుస్తోంది.
ఏది ఏమైనా 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సంబరాలు చేసుకోవాల్సిన ఈ సంవత్సరంలో తనా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ విధంగా 8 మంది ఒక వైపు ఇంకో 8 మంది రెండో వైపు చేరడం చాలా బాధాకరం అని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. 50 ఏళ్ల చరిత్ర, దాదాపు 90 వేల మంది లైఫ్ నెంబర్లు ఉన్న తానా సంస్థని నడపటం, నాయకత్వం వహించడం సులభమైన విషయం కాదు అని అందరికీ తెలుసు అయినా ఇప్పుడు ఉన్న నాయకులు అందరూ అటు నాయకత్వ పటిమ లోను ఇటు సేవాభావం లోనూ ఒకరినుంచి ఒకరు ఉన్నారు కనుక వాళ్ళందరూ తమ తమ పట్టుదల విడిచి సంస్థ ని, సంస్థ లో ఉన్న సభ్యులను, సంస్థకు ఉన్న శ్రేయోభిలాషులను, సంస్థ వలన బాగు పడే అనేక మంది జీవితాలను గుర్తించి వివాదానికి వెంటనే ముగింపు పలకాలని తెలుగు టైమ్స్ కోరుకొంటోంది. అయితే ” అందరూ బంధువులే — ఎటు పక్క చూసినా తెలిసిన వారే ” అని ఆర్జనుఁడు యుద్దానికి ముందు బాధపడిన చందాన తెలుగు టైమ్స్ కూడా ఈ స్టోరీ రాయడానికి 10 రోజులు ఆగింది. ఇతరుల విషయాలు చెపుతూ వారి బాధ్యతలను గుర్తు చేయడమే పత్రికల బాధ్యత అని ఈ వార్త ను ప్రచురిస్తున్నాం.






