మే 16న డల్లాస్‌లో ‘డారా’ మాతృ దినోత్సవ వేడుకల సందడి
DARA: డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ (DARA) ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలను మే 16, 2026 శనివారం నాడు ఫ్రిస్కో ఈవెంట్ సెంటర్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. “తల్లి – ఇంటికి ప్రాణం” (Honoring the Heart of the Home) అనే నినాదంతో నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా మహిళల కోసం వినోద, ఆధ్యాత్మిక , వ్యాపార వేదికలను భారీగా సిద్ధం చేశారు.
కార్యక్రమ వివరాలు..
ఈ వేడుకలు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు ఉత్సాహంగా సాగనున్నాయి. ఇందులో భాగంగా ‘డే మార్కెట్’లో ప్రత్యేకంగా చీరలు, ఆభరణాలు, యాంటిక్ సెట్స్‌తో వెండర్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి ఈశా ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత ‘ఈశా యోగా’ శిబిరాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ‘ఈవినింగ్ గాలా’లో డా. జయ బాథిన, వందిత పారిఖ్, ప్రియా రెడ్డి వంటి ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు.
ప్రధాన ఆకర్షణలు..
ఫ్రిస్కో ఈవెంట్ సెంటర్ (4633 Coit Rd, Suite 310) వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ఫన్ గేమ్స్, స్పాట్ గిఫ్ట్స్, సిల్వర్ గిఫ్ట్ కార్డ్స్ , డీబేట్లు ఉండనున్నాయి. రాత్రి 8 గంటల నుండి రాయలసీమ రుచులతో కూడిన విందు భోజనం, అనంతరం డీజే సందడి ఉంటుంది.
డారా కార్యవర్గ పర్యవేక్షణ..
ప్రెసిడెంట్ వీర శివారెడ్డి లేవక, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గౌతమ్ కాసిరెడ్డి, సెక్రటరీ మహేంద్ర పద్మరాజు, ట్రెజరర్ శ్రీని అన్నారెడ్డిలతో పాటు గౌతమ్ మియాపురం, గురు మల్లెల, అవినాష్ వెల్లంపటి , సరిత సింగం తదితర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఈ వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం darausa.org/events వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు కోరారు.






