ఈడెన్ గార్డెన్స్‌లో హై-వోల్టేజ్ పోరు..!
టాటా ఐపీఎల్ 2026(IPL 2026) లీగ్ దశ ముగింపునకు వస్తున్న తరుణంలో నేడు కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. ఈ సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు కోసం పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్న శుభమన్ గిల్(Shubhman Gill) నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్(GT).. అజింక్య రహానే(Ajinkya Rahane) కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో(KKR) తలపడనుంది. ఈ టోర్నమెంట్లో నిలదొక్కుకోవడానికి కేకేఆర్‌కు ఈ మ్యాచ్ విజయం అత్యంత కీలకం కాగా, గుజరాత్ టైటాన్స్ తమ వరుస విజయాల జోరును కొనసాగించి ప్లేఆఫ్స్ బెర్త్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే గుజరాత్ టైటాన్స్‌దే స్పష్టమైన ఆధిక్యంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి తలపడిన మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్ ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయం సాధించి పైచేయి సాధించింది. ఈ సీజన్లోనే అహ్మదాబాద్ వేదికగా జరిగిన వీరి మొదటి ముఖాముఖి మ్యాచ్‌లో కూడా గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 86 పరుగులతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి చిన్న బౌండరీలు, వేగవంతమైన అవుట్‌ఫీల్డ్ కారణంగా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్లు ఇక్కడ మొదట ఫీల్డింగ్ ఎంచుకుని, చేజింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది. సాయంత్రం వేళ మంచు ప్రభావం (Dew Factor) కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపవచ్చు. వాతావరణం విషయానికి వస్తే కోల్‌కతాలో నిన్న సాయంత్రం వర్షం పడినప్పటికీ.. నేటి మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం కేవలం 1 శాతం మాత్రమే ఉందని, మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం కలగకపోవచ్చని సమాచారం.







