అప్పటి వరకు తానే సీఎంగా : రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. 2034లో రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ను గెలిపించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పారు. అప్పటి వరకు తానే సీఎంగా ఉంటానన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని ప్రధాని (Prime Minister)ని చేయడమే తన లక్ష్యమని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాహుల్ తర్వాతి స్థానంలో ఉంటానని వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే రాహుల్ గాంధీ లక్ష్యమన్నారు. ఆయనకు ప్రధాని కావాలనే కోరిక లేదని, ఆ పదవికి పోటీ పడాలని తాను ఒప్పించానని రేవంత్ చెప్పారు.







