అలా చేస్తే ఆయన గౌరవం పెరుగుతుంది : సీఎం రేవంత్ రెడ్డి
పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ (Bandi Bhageerath) పారిపోవడం తప్పు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) నైతిక బాధ్యత తీసుకుని కుమారుడిని అప్పగించాలని, అలా చేస్తే ఆయన గౌరవం పెరుగుతుందని తెలిపారు. ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, పారిపోతే సమస్యలకు పరిష్కారం దొరకదని చెప్పారు. బండి సంజయ్ కింది నుంచి కష్టపడి పైస్థాయికి వచ్చారని, కుమారుడి కారణంగా ఆయనకు తలవంపులు వచ్చాయని అన్నారు. తప్పయినా, ఒప్పయినా ఆయన నిలబడి సమాధానం చెప్పాలన్నారు. తక్షణమే కుమారుడిని పీఎస్ (PS) లో అప్పగించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ కేసులో ఎవరిది తప్పనే విషయాన్ని విచారణ అధికారులు తేలుస్తారన్నారు.








