చెన్నై చేపాక్‌లో కీలక పోరు..!
ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య అత్యంత కీలకమైన 63వ మ్యాచ్ జరగనుంది. ప్లేఆఫ్స్ రేసు పరంగా ఇరు జట్లకు ఈ పోరు చావో రేవో లాంటిది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ చెన్నైలోని ప్రముఖ ఎం. ఏ. చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గనుక హైదరాబాద్ విజయం సాధిస్తే నేరుగా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. సీఎస్కే ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ చివరి హోమ్ గ్రౌండ్ మ్యాచ్‌తో పాటు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరు జట్ల మధ్య ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై, హైదరాబాద్ జట్లు మొత్తం 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 15 సార్లు విజయం సాధించగా, ఎస్ఆర్హెచ్ 8 సార్లు విజయం సాధించింది.
అయితే, ఈ సీజన్ మొదటి ఫేస్‌లో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి మంచి జోష్‌లో ఉంది. ఈ మ్యాచ్ చెన్నై చేపాక్ స్టేడియంలో ఈ సీజన్‌కు చివరి లీగ్ మ్యాచ్ కావడం, అలాగే ఎమ్మెస్ ధోనీ (MS Dhoni) కెరీర్లో చేపాక్ గ్రౌండ్లో ఇదే ఆఖరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాల నడుమ అభిమానుల్లో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో టాస్ కీలకం కానుంది.
ఇవి కూడా చదవండి







