కేరళలో సీఎం పీఠం ‘‘నలుగురిది’’…
ఒకే ఒక్క ప్రమాణ స్వీకారం కేరళ అంతర్గత రాజకీయాలను నిర్దేశించనుంది. కేరళలో కాంగ్రెస్ కూటమి 102 స్థానాలను గెలుచుకుంది. దీంతో కేరళ రాజకీయ క్షేత్రంలో కాంగ్రెస్ తిరిగి బలపడింది. దీని ద్వారా పదేళ్ల వామపక్షాల పాలనకు తెరపడింది. అయితే సతీశన్ ప్రమాణ స్వీకారం పైకి చూస్తే ఒక సాధారణ ప్రజాస్వామ్య ప్రక్రియలా అనిపించవచ్చు గానీ, కేరళ రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్నవారికి మాత్రం—ఇది కేవలం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మాత్రమే కాదని.
ముఖ్యమంత్రి పగ్గాలు వి.డి. సతీశన్ అయినా… తిరువనంతపురం రాజకీయ వర్గాల్లో మాత్రం వేరే చర్చ నడుస్తోంది. ఈ ప్రభుత్వం కేవలం సతీశన్ ది మాత్రమే కాదని, మూడున్నర మంది ముఖ్యమంత్రుల ప్రభుత్వంగా వుండబోతోందని. ఇందులో వీడీ సతీశన్, చెన్నితల, కేసీ వేణుగోపాల్ ఈ ముగ్గురు పార్టీలో, ప్రభుత్వంలో సమాన అధికార కేంద్రాలుగా ఆవిర్భవించాయి. మిగిలిన అర ప్రభుత్వం ముస్లింలీగ్ చేతిలో వుంది. ఓ రకంగా చెప్పాలంటే కింగ్ మేకర్.
ఇవి కూడా చదవండి
వీడీ సతీశన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే రాజకీయ క్రీడ ప్రారంభమైపోయింది. రమేశ్ చెన్నితల అలిగారు. దీంతో సమతుల్య క్రీడను సతీశన్ ప్రారంభించి, అత్యంత జాగ్రత్తగా 20 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అందర్నీ సంతృప్తి పరిచే క్లిష్టమైన పనిని పూర్తి చేశారు.
ఇక.. ఫలితాలు రాగానే సీఎం పదవి కోసం ముగ్గురూ పోటీ పడ్డారు. రాజకీయాలలో అనుభవజ్ఞుడైన K.C. వేణుగోపాల్ మరియు సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల. అంతిమంగా హైకమాండ్ సతీశన్‌కు తన ఆమోద ముద్ర వేసినప్పటికీ, అసలైన పరీక్ష మాత్రం మంత్రివర్గ కూర్పులోనే దాగి ఉంది.
దీనిని కూడా సతీశన్ విజయవంతంగా పూర్తి చేశారు. మంత్రివర్గ కూర్పులో ఏ వర్గాన్ని కూడా విడిచిపెట్టలేదు. ఆ ప్రక్రియలో ‘ప్రాంతీయ, సామాజిక సమతుల్యత’ను పాటించారు. అయితే.. అర్హత వుండి, సీనియర్లైన వారికి కొందరికి ఇందులో చోటు దక్కలేదని కూడా అంగీకరించారు. పూర్తిగా విధేయతకే పెద్దపీట వేశారు. దీంతో అసమ్మతి కాస్త చల్లారింది.
ఇవి కూడా చదవండి







