మే 23, 24 తేదీల్లో వైభవంగా ‘ అన్నమాచార్య 618వ జయంతి ఉత్సవాలు
SiliconAndhra:పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సిలికానాంధ్ర సంస్థ భారీ ఎత్తున వేడుకలకు శ్రీకారం చుట్టింది. మే 23 , 24 తేదీలలో కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో ఉన్న ఆరియా యూనివర్సిటీ (Aria University) వేదికగా ఈ ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.
ప్రత్యేక ఆకర్షణలు..
ఈ రెండు రోజుల వేడుకల్లో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ముఖ్యంగా మే 23వ తేదీ సాయంత్రం 5:00 గంటలకు ప్రముఖ విద్వాంసులు విద్వాన్ డా. మల్లాది రవికుమార్ బృందం చేత “అన్నమయ్య గానామృత లహరి” కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీరికి శ్రీరామ్ బ్రహ్మానందం (మృదంగం), శ్రీమతి అనురాధ శ్రీధర్ (వయలిన్) సహకారం అందించనున్నారు.
ఇవి కూడా చదవండి
కార్యక్రమ వివరాలు..
వేదిక: Aria University, 1521 California Cir., Milpitas, CA 95035.
మే 23 షెడ్యూల్: రథోత్సవం, సప్తగిరి సంకీర్తన గోష్ఠి గానం, అష్టోత్తర శత సంకీర్తానార్చన, అన్నమయ్య గానామృత లహరి , పవళింపు సేవ.
మే 24 షెడ్యూల్: ఇన్స్ట్రుమెంటల్ , డాన్స్ గ్రూప్ పెర్ఫార్మెన్స్, గురు సమర్పణ (వాణి గుండ్లపల్లి , మీనాక్షి గణేషన్ బృందాలచే నృత్య ప్రదర్శనలు).
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆసక్తి గల వారు https://tinyurl.com/Annamacharya-Jayanthi-618 లింక్ ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు వంశీకృష్ణ నాదెళ్ల (408-718-4552) లేదా ప్రియ తనుగుల (949-572-9320) ను సంప్రదించవచ్చు. తెలుగు సంస్కృతిని, అన్నమయ్య సంకీర్తన వైభవాన్ని చాటిచెప్పే ఈ మహా ఉత్సవంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిలికానాంధ్ర బృందం విజ్ఞప్తి చేసింది.








