అశోక్ చింతకుంటకు టిఫాస్ ఉగాది పురస్కారం
న్యూజెర్సిలో ఇటీవల జరిగిన తెలుగు కళాసమితి ఉగాది వేడుకల్లో ప్రముఖ రంగస్థల కళాకారుడు, కమ్యూనిటీ ప్రముఖులు అశోక్ చింతకుంటకు ఉగాది పురస్కారాన్ని అందజేశారు. రంగస్థలం కేటగిరీకి సంబంధించి ఈయనకు ఈ పురస్కారం లభించింది. ఈ వేడుకల్లో అశోక్ చింతకుంటగారు శ్రీ కృష్ణరాయబారం దృశ్యనాటికలోని పద్యాలను పాడి అందరినీ రంజింపజేశారు. అశోక్ చింతకుంట గారు, ఆయన సతీమణి శ్రీమతి మాధవి సోలేటి దంపతులు తెలుగు సంఘాలు జాతీయ, ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే వేడుకల్లో పౌరాణిక ప్రదర్శనలను చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అశోక్ చింతకుంటకు ఉగాది పురస్కారం లభించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు.







