పెద్ది ఆఖరి 45 నిమిషాలు.. గుండె బరువెక్కి పోతుందట!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది(Peddi)పై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి. ఉప్పెన(Uppena) తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సాన(Buchibabu Sana) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా గురించి తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా సినిమా ఎమోషనల్ కోణంపై డైరెక్టర్ చెప్పిన అంశాలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. కమర్షియల్ హంగులు ఉన్నప్పటికీ, సినిమాకు కథలోని ఎమోషన్సే అసలు బలం అని బుచ్చిబాబు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సినిమా చివరి భాగం ప్రేక్షకులను బలంగా కదిలిస్తుందని దర్శకుడు చెప్తున్నారు. ముఖ్యంగా ఆఖరి 45 నిమిషాలు కథను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్తాయని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుతూ, ఆయన ముఖంలో కనిపించే సహజమైన నిజాయితీనే పెద్ది పాత్రకు ప్రధాన బలం అయిందని బుచ్చిబాబు అభిప్రాయపడ్డారు. గతంలో రంగస్థలం(Rangasthalam)లో చిట్టిబాబు(Chittibabu) పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చరణ్, ఈసారి మరింత లోతైన పాత్రతో కనిపించబోతున్నాడనే సంకేతాలు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ బజ్‌ను తీసుకురాగా, తాజా కామెంట్స్‌తో ఆ హైప్ మరింత పెరిగింది. భారీ యాక్షన్ విజువల్స్ కంటే, బలమైన ఎమోషన్స్ ఆధారంగా కథను నడిపించే ప్రయత్నం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టనుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా పూర్తయ్యాక కూడా ప్రేక్షకులు ఆ భావోద్వేగాల నుంచి వెంటనే బయటకు రాలేరని దర్శకుడు చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.







