బంగారం లాంటి ఛాన్స్ ను మిస్ అయిన ఖుషి
టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్న పాన్ ఇండియా సినిమా పెద్ది గురించి తాజాగా బయటకు వచ్చిన ఓ ఆసక్తికరమైన విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిన్గా జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం మొదటగా ఎంపికైనది జాన్వీ కాదని, ఆమె చెల్లెలు ఖుషీ కపూర్(Khushi Kapoor) అని తాజాగా బుచ్చిబాబు వెల్లడించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కథకు కొత్తదనంతో పాటు ఫ్రెష్ ఫేస్ కావాలనే ఆలోచనతో మొదట ఖుషి కపూర్ పేరును పరిశీలించామని ఆయన తెలిపారు.
అంతేకాదు, ఖుషి పాత్రకు బాగా సూట్ అవుతుందని భావించి ప్రారంభ స్థాయి చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. అయితే తర్వాత ఆ పాత్రకు ఖుషి చిన్నగా కనిపిస్తుందని, చివరకు జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సిస్టర్స్ మధ్య ఇలా ప్రాజెక్ట్ మారడం ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరిగే విషయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా హీరోలు లేదా హీరోయిన్ల మధ్య డేట్స్, స్క్రిప్ట్ కారణాల వల్ల సినిమాలు మారుతుంటాయి. కానీ చెల్లి కోసం వెళ్లిన అవకాశం చివరకు అక్క దగ్గరికి వెళ్లడం ఆసక్తికర ట్విస్ట్‌గా మారింది.
ఇక ఖుషి కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టి ఉంటే, అది ఆమె కెరీర్లోనే అతిపెద్ద లాంచ్ అయ్యేదని చాలామంది భావిస్తున్నారు. కానీ చివరికి ఆ అవకాశం జాన్వీ ఖాతాలో పడింది. ఇప్పటికే దేవర(Devara) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జాన్వీ, ఇప్పుడు పెద్దితో మరింత బలమైన గుర్తింపు సంపాదించాలని చూస్తోంది. మరోవైపు రామ్ చరణ్- జాన్వీ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడగా, ఈ కొత్త సమాచారం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.







