వైట్ డ్రెస్సులో ఆకట్టుకుంటున్న హన్సిక
దేశముదురు(Desamudhuru) సినిమాతో కుర్రకారు గుండెల్లో పాగా వేసిన హన్సిక మోత్వాని(hansika motwani). ఎప్పుడూ ట్రెండీ లుక్స్‌తో మెరిసిపోతూ ఉంటుంది. ఈ బ్యూటీ, తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన స్ట్రీట్‌వేర్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె చాలా స్టైలిష్ గా,అంతే సింపుల్‌గా కనిపించింది. వైట్ కలర్ క్రాప్డ్ బటన్ అప్ షర్టుకు జతగా,డార్క్ గ్రే కలర్ లూజ్ ప్యాంట్ వేసుకుంది. ఈ స్ట్రీట్‌వేర్ లుక్ హన్సికకు పర్ఫెక్ట్గా సెట్ అయిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ అవుట్‌ఫిట్‌లో వైట్ షర్ట్ పొడవాటి చేతులతో, కాటన్ పాప్లిన్ ఫ్యాబ్రిక్‌తో క్లాసీ లుక్ ఇస్తుంటే.. దానికి మ్యాచ్ చేసిన ప్యాంట్ మంచి వైబ్‌ను ఇస్తోంది. హెవీ మేకప్ లేకుండా, సింపుల్ హెయిర్ స్టైల్‌తో హన్సిక ఫోటోలకు ఇచ్చిన పోజులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.







