వైరల్ అవుతన్న డ్రాగన్ గ్లింప్స్ రన్‌టైమ్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరోగా, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం #NTRNeel పేరుతో పిలుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా మే 20న విడుదల కాబోతున్న స్పెషల్ గ్లింప్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్న ఈ గ్లింప్స్‌కు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. ముఖ్యంగా గ్లింప్స్ రన్‌టైమ్ ఏకంగా 4 నిమిషాల 35 సెకన్లు ఉండటమే అభిమానుల్లో భారీ హైప్‌ను తీసుకొచ్చింది. సాధారణ టీజర్స్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ నిడివితో రావడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఇక ఈ గ్లింప్స్‌కు సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందులో కనిపించిన డ్రాగన్(Dragon) పేరు ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇప్పటివరకు అధికారిక టైటిల్‌ను ప్రకటించని మేకర్స్, ఇదే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా కూడా అగ్ని పర్వతంలా పేలిపోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎలివేషన్స్‌తో ఎన్టీఆర్‌ను పూర్తిస్థాయి పవర్ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారని సమాచారం.
ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎలివేషన్స్‌తో పాటు సంగీత దర్శకుడు రవి బస్రూర్(Ravi Basrur) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో బీజీఎంకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రేక్షకులకు ఇప్పటికే తెలిసిన విషయమే. ఇప్పుడు డ్రాగన్ గ్లింప్స్‌లో కూడా అదే స్థాయి మాస్ ఇంపాక్ట్ ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా, కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే మాస్ ఈవెంట్‌గా మారబోతుందనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.







