18th May 2026

____________

- Saidulu

సహజ ఆరోగ్యానికి దివ్య ఔషధం.. చమోమిలే టీ..

చమోమిలే ఒక చిన్న తెలుపు రంగు పువ్వు. చూడడానికి చిన్నపాటి డైసీలా ఉండే ఈ పూవును హర్బల్ టీ తయారీలో ఉపయోగిస్తారు.

చమోమిలే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హర్బల్ డ్రింక్‌గా ప్రసిద్ధి చెందింది. రోజూ ఒక కప్పు తాగితే శరీరానికి ప్రశాంతత లభిస్తుంది.

చమోమిలే పూలతో తయారయ్యే ఈ టీకి సహజమైన సువాసన ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

రాత్రి నిద్రపోయే ముందు ఈ టీ తాగితే మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది ఉపయోగకరం.

జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా చమోమిలే టీ సహాయపడుతుంది. కడుపులో ఉబ్బరం, అసౌకర్యం తగ్గుతుంది.

చలికాలంలో ఈ టీ తాగితే శరీరానికి హాయిగా అనిపిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా కొంత సహాయం చేస్తుంది.

చర్మ ఆరోగ్యానికి కూడా ఇది మంచిదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అలసటను తగ్గించి ఫ్రెష్‌గా ఉంచుతుంది.

బరువు నియంత్రణలో ఉండేందుకు కూడా ఈ హర్బల్ టీ కొంతవరకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా దీనిని తీసుకుంటున్నారు.

అయితే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహాతోనే చమోమిలే టీ తీసుకోవడం మంచిది.