ఎపిఎన్నార్టీ ఆఫీసులో తెలంగాణ కమిటీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించింది. పర్యటనలో భాగంగా మొదటి రోజు తాడేపల్లిలోని ఏపిఎనఆర్టిఎస్ కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్ర ఎనఆరఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపిఎనఆర్టిఎస్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రవి వేమూరు, సీఈఓ కృష్ణమోహన్, డైరెక్టర్ నాగేంద్ర బాబు అక్కిలి, ఇతర అధికారులతో సమావేశమై, పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారైలు, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యులు అభినందించారు.
విదేశాల్లో ప్రత్యేక ప్రతినిధులను నియమించడం, ప్రవాసాంధ్రులను ఏకతాటిపైకి తీసుకురావడాని¿ ఏపిఎనఆర్టిఎస్ సొసైటీ ఏర్పాటు చేయడం, ప్రతి జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బందిని కేటాయించడం, 24 గంటల సహాయ కేంద్రం నిర్వహించడం, పంజాబ్ రాష్ట్రం స్ఫూర్తితో ఏపీ పోలీస్ ఎన్నారై సెల్ ఏర్పాటు చేయడం, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, పరిమితులు లేకుండా ప్రవాసాంధ్ర బీమా అమలు వంటి కార్యక్రమాలు ఆదర్శవంతమైనవిగా కొనియాడారు.
అలాగే, విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రవాస భారతీయులకు వేగవంతమైన సహాయం అందించడం వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతో ఎన్నారై సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో తెలంగాణా కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తమవంతు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్ ఆర్టిఎస్ చైర్మన్ రవి వేమూరు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి







