జూన్ 6న డెట్రాయిట్లో ఘనంగా ‘తెలంగాణ మేళా
DTC: అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో గల తెలంగాణ కుటుంబాలు, స్నేహితులు, సందర్శకులు , స్థానిక వ్యాపారస్తులను ఒకే వేదికపైకి తెస్తూ ‘డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ (DTC)’ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ మేళా 2026’ వేడుకను నిర్వహించనుంది. ‘దేశీ ట్రెండ్జ్’ (Desi Trendz) భాగస్వామ్యంతో జూన్ 6, 2026 (శనివారం) మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మిచిగాన్‌లోని నోవి నగరంలో గల ప్రసిద్ధ ‘టోకా సాకర్ అండ్ స్పోర్ట్స్ సెంటర్’ (TOCA Soccer and Sports Center – 41550 Grand River Ave, Novi, MI 48375) వేదికగా ఈ గ్రాండ్ సెలబ్రేషన్ జరగనుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆతిథ్యం , వినోదాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన చేసిన ఈ మేళాకు వచ్చే సందర్శకులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
ఇవి కూడా చదవండి
ప్రత్యేక ఆకర్షణలు..
ఈ భారీ ఈవెంట్లో సందర్శకుల కోసం సాంప్రదాయ దుస్తులు, జ్యువెలరీ, యాక్సెసరీస్, హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్స్ ప్రదర్శనలతో పాటు నోరూరించే తెలంగాణ వంటకాలు, స్వీట్స్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటే రియల్ ఎస్టేట్, అటార్నీలు & లీగల్ సర్వీసెస్, సీపీఏలు & అకౌంటింగ్ వంటి ప్రొఫెషనల్ సేవల స్టాల్స్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపార నెట్వర్కింగ్ పెంచుకోవడానికి, కుటుంబ సమేతంగా వినోదాన్ని ఆస్వాదించడానికి , మన మూలాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశమని నిర్వాహకులు పేర్కొన్నారు.
నిర్వహకులు..
ఈ మేళాను విజయవంతం చేయడానికి డిటిసి లీడర్షిప్ టీమ్ సభ్యులైన ప్రెసిడెంట్ రవి ఎల్లందుల, చైర్మన్ శ్రీధర్ ఐత, ప్రెసిడెంట్-ఎలెక్ట్ శశి ఎల్లందుల, జనరల్ సెక్రటరీ వంశీ మురికి, ట్రెజరర్ భూపేష్ అల్లాడి , బోర్డ్ సెక్రటరీ శ్రీకాంత్ దాచరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేళాలో స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునే వెండర్స్ ,
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఇతర రిజిస్ట్రేషన్ల వివరాల కోసం (267) 317-6739, (734) 788-6627 లేదా (815) 508-2114 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ ప్రతినిధులు కోరారు.







