ఆయన కల నిజం చేయడానికే నేను కాంగ్రెస్లో ఉన్నా : వైఎస్ షర్మిల
వైఎస్సార్ (YSR) పేరు చెప్పి ప్యాలెస్ లు కట్టుకొని రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని వైసీపీ (YCP) నేతలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y.S. Sharmila) ఆరోపించారు. విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి, పాదయాత్ర చేసినంత మాత్రాన ఆయన వారసులు కారని దుయ్యబట్టారు. వైఎస్సార్ ఆశయాలు, సిద్ధాంతాలను పాటించే వారే ఆయనకు నిజమైన వారసులు. కాంగ్రెస్ ను బలపరచడం అంటే వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడమే. ఆయన సులువుగా సీఎం కాలేదు. అయ్యాక కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ మధ్య నాయకులు ఒకసారి సీఎం అయితే ప్రజలకు అందుబాటులో ఉండరు. సొంత పార్టీ నాయకులకూ కనపడరు. సీఎం అంటే ఎలా ఉండాలో వైఎస్సార్ చూపించారు. రాహుల్ (Rahul) ని ప్రధాని చేయాలని వైఎస్సార్ కోరుకున్నారు. ఆయన కల నిజం చేయడానికే నేను కాంగ్రెస్ (Congress)లో ఉన్నా. వైఎస్సార్ బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మంది చనిపోకూడదనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించింది అని అన్నారు.
ఇవి కూడా చదవండి







