వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు చేస్తాం : మంత్రి నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వెయ్యి మినీ మార్టులు (Mini marts) ఏర్పాటు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi), పెట్రోలియం, సహజ వాయువు శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ (Neeraj Mittal), సంయుక్త కార్యదర్శి సుజాత శర్మతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన సరుకులు అందించేందుకు నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్) ముందుకొచ్చిందని చెప్పారు. కందిపప్పు, మినపప్పు, తృణధాన్యాలు తదితరాలను మార్కెట్ ధర కంటే తక్కువకు మినీ మార్టుల్లో సరఫరా చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని మిలటరీ క్యాంటీన్లలో అరకు కాఫీ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి







