వారిపై కఠిన చర్యలు : మంత్రి నాదెండ్ల హెచ్చరిక
బంకుల్లో ఇంధన కొరతపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సమీక్ష చేపట్టారు. పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ను దారి మళ్లించే వారిపై కఠినంగా వ్వహరించాలని అధికారులను ఆదేశించారు. పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్నా, లేదని చెప్పే బంకులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బంకుల్లో రేషన్ (Ration ) పద్దతిని కొనసాగించాలని ఆదేశించారు. బంకుల మూసివేత తగ్గిందని, కంపెనీల నుంచి సరఫరా పెరిగిందని తెలిపారు. ఆక్వా, వరి రైతులకు ఇంధన కొరత రాకుండా చూడాలని కోరారు. సోషల్ మీడియా (Social Media)తో దుష్ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రో బంకులు ఉద్దేశపూర్వకంగా ఇంధనం ఇవ్వడం లేదని టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై తక్షణం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






