ఇంట్లోని చెక్క ఫర్నిచర్‌ను అందంగా, బలంగా ఉంచుకోవడం ప్రతి ఇంటి యజమాని కోరికే. చెదపురుగులు బయటకు కనిపించకుండా చెక్కను లోపలి నుంచి తినేసి భారీ నష్టం కలిగిస్తాయి.
చెదలు ఒకసారి ఫర్నిచర్‌కు పడితే క్రమంగా చెక్క మొత్తం గుల్లగా మారుతుంది. చాలాసార్లు బయటికి బాగానే కనిపించినా లోపల పూర్తిగా పాడైపోతుంది.
ఈ సమస్యను తగ్గించేందుకు బోరిక్ యాసిడ్ మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. దీనిని నీటిలో కలిపి చెదలు ఉన్న భాగాలపై స్ప్రే చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
బోరిక్ యాసిడ్ చెదపురుగుల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అవి త్వరగా నశించి ఫర్నిచర్ మరింత దెబ్బతినకుండా కాపాడబడుతుంది.
వేప నూనె కూడా చెదలను దూరంగా ఉంచే సహజమైన మార్గం. వేపలోని చేదు గుణాలు చెదపురుగులను చెక్కకు చేరనివ్వవు.
కాటన్ క్లాత్ లేదా బ్రష్‌తో వేప నూనెను చెక్క వస్తువులపై రాస్తే మంచి రక్షణ లభిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చెదలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చెదలు వేగంగా వ్యాపిస్తాయి. అందుకే ఇంటిని ఎప్పుడూ పొడిగా ఉంచడం చాలా అవసరం.
ఫర్నిచర్‌కు అప్పుడప్పుడు ఎండ తగిలేలా చూడటం కూడా మంచిదే. లీకేజీలు లేకుండా జాగ్రత్త పడితే చెదల సమస్యను చాలా వరకు నివారించవచ్చు.
ఒకవేళ చెదలు ఎక్కువగా వ్యాపించి ఉంటే వెంటనే పెస్ట్ కంట్రోల్ నిపుణులను సంప్రదించడం మంచిది. చిన్న జాగ్రత్తలతో ఖరీదైన చెక్క ఫర్నిచర్‌ను చాలా కాలం సురక్షితంగా ఉంచుకోవచ్చు.