పాలమూరు రంగారెడ్డికి ప్రాధాన్యం..నిధుల విడుదలలో జాప్యం ఉండదు : సీఎం రేవంత్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ టర్మ్ లోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం ఎంసీహెచ్ఆర్డీ లో ప్రాజెక్టులపై సమీక్షించారు. పాలమూరు ( Palamuru)- రంగారెడ్డి (Rangareddy)కి సంబంధించి నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిలిచిపోయిన భూ సేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపది కన పూర్తి చేయాలని, జిల్లా మంత్రులు ( Ministers), ఎమ్మెల్యేలందరూ పాలు పంచుకోవాలని, దగ్గరుండి మరీ పూర్తి చేయించాలని నిర్దేశించారు. భూసేకరణ పూర్తి కాగానే పనులు కూడా చేపట్టాలని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మక్తల్- నారాయణపేట- కొడంగల్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూములను సేకరించే ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. భూ సేకరణపై నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని నిర్దేశించారు. ఆ సమావేశాలకు ఈఎన్సీలనూ పంపిస్తానని చెప్పారు. ప్రాజెక్టుల భూసేకరణను తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుందని, భూ సేకరణకు నిధుల విడుదలలో ఎటువంటి జాప్యమూ ఉండబోదని, పెండింగ్ బిల్లుల చెల్లింపులను కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి







