సుడిగాలి సుధీర్ కొత్త సినిమా “సుధీర్ జోకర్” టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సుడిగాలి సుధీర్ హీరోగా “సుధీర్ జోకర్” అనే కొత్త చిత్రం రాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది .ఈ చిత్రంలో అభిరామి,మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.
రేపు హీరో సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ రోజు “సుధీర్ జోకర్” టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్లేయింగ్ కార్డ్స్ తో ఉన్న సుడిగాలి సుధీర్ ఆకట్టుకుంటున్నారు. రేపు ఈ సినిమా బాంగర్ రిలీజ్ తో పాటు ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కూడా జరగబోతోంది. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా “సుధీర్ జోకర్” సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.






