లండన్‌లో ఘనంగా TAL బ్యాడ్మింటన్ టోర్నమెంట్.. హోరాహోరీగా సాగిన ఫైనల్స్
TAL: యునైటెడ్ కింగ్డమ్ (UK) లోని తెలుగు సమాజంలో క్రీడా ఉత్సాహాన్ని పెంపొందిస్తూ ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్‘ (TAL) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘టాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026’ ఫైనల్స్ మే 17న స్లౌలోని హెర్షెల్ గ్రామర్ స్కూల్ (Herschel Grammar School) లో అత్యంత వైభవంగా ముగిశాయి. తెలుగు కమ్యూనిటీకి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులను, అభిమానులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ టోర్నమెంట్ రోజంతా హోరాహోరీ పోటీలు, క్రీడాస్ఫూర్తితో సాగింది. ఈ క్రీడా సంబరంలో వివిధ విభాగాల నుండి 70 మందికి పైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

వివిధ విభాగాల విజేతలు..
ఈ టోర్నమెంట్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల డబుల్స్ విభాగంలో అమర్, మహి జంట విన్నర్స్‌గా నిలవగా.. సంతోష్ చెబ్రోలు, ఆకాష్ గుండ్లతాటి జంట రన్నర్స్ అప్‌గా నిలిచారు. పురుషుల 40+ డబుల్స్ విభాగంలో శ్రీ, సురేష్ ల జోడి విజయం సాధించగా.. రవి పోతూరి, సురేందర్ మసూరం జంట రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనోభి రామ్ వడ్డి, జ్యోత్స్న చుకైరా జంట టైటిల్ కైవసం చేసుకోగా.. అమర్, ఆశ్రిత జంట ద్వితీయ స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి
మహిళల విభాగాల్లోనూ పోటీలు ఆకట్టుకున్నాయి. మహిళల డబుల్స్‌లో ఆశ్రిత, జ్యోత్స్న జంట విన్నర్స్‌గా నిలవగా.. స్మిత, గీతిక జంట రన్నర్స్ అప్‌గా నిలిచారు. అలాగే మహిళల 35+ డబుల్స్ విభాగంలో శిల్ప, జి శంకర్ సేట్ జోడి విజేతలుగా, స్మిత, లక్ష్మి జంట రన్నరప్స్గా నిలిచారు. జూనియర్ గర్ల్స్ డబుల్స్ విభాగంలో సింధుజ దేవరకొండ, హవిషా బత్తుల అద్భుత ప్రదర్శనతో విజయం సాధించగా.. సంజనా పడిగల, సహస్ర నారోజు జంట రన్నర్స్ అప్‌గా నిలిచారు.

క్రీడాకారులకు అభినందనలు, నిర్వాహకులకు కృతజ్ఞతలు..
టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విజేతలను, ప్రతిభ చాటిన ప్రతి ఆటగాడిని ‘టాల్’ (TAL) ఛైర్మన్ రవి సబ్బా ప్రత్యేకంగా అభినందించారు. స్పోర్ట్స్ ట్రస్టీ సత్య పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమించిన స్పోర్ట్స్ ఇంచార్జ్ సింధూర చెరకుతో పాటు బ్యాడ్మింటన్ కమిటీ సభ్యులు అనిల్ రెడ్డి, బాలాజీ కల్లూరు, మీనా దేవనబోయిన, దివ్య మూలా, రవి దేవనబోయిన, కృష్ణ కిషోర్, రాజేష్ తోలేటి, శ్రీధర్ సోమిశెట్టి, సుధాకర్ గుబ్బలలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రవి సబ్బాతో పాటు సహ ట్రస్టీలు అనిల్ అనంతుల, అశోక్ మాడిశెట్టి, రవి మోచెర్ల, వెంకట్ నీలా, కిరణ్ కప్పేట , ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి స్వచ్ఛందంగా సేవలందించిన వాలంటీర్లకు మేనేజ్మెంట్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. యూకే అంతటా క్రీడలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ‘టాల్’ నిరంతరం ఇలాంటి సాంస్కృతిక, క్రీడా ఈవెంట్లను నిర్వహిస్తూ తెలుగు సమాజ బంధాలను మరింత బలోపేతం చేస్తోందని ప్రతినిధులు పేర్కొన్నారు.
మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






