కేఆర్ఎంబి సమావేశం మరోమారు వాయిదా
నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణా నదీ (Krishna River) యాజమాన్య బోర్డు సమావేశం మరోవారు వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని తొలుత ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు. అదే రోజు ఏపీ కేబినెట్ (AP Cabinet) సమావేశం ఉండడంతో భేటీని ఈ నెల 21వ తేదీకి గతంలో వాయిదా వేశారు. అయితే ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దీంతో కేఆర్ఎంబి (KRMB) సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ (Telangana) విజ్ఞప్తి మేరకు 21న జరగాల్సిన సమావేశాన్ని కేఆర్ఎంబి వాయిదా వేసింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి






