ఆ రోజు కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
కేరళలో జరిగిన మహత్తరమైన వేడుక వద్దకు తాను చేరుకున్నప్పుడు, స్నేహితులు, సహచరులను మళ్లీ కలిసినట్లుగా అనిపించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ఈ వేడుకలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ విందర్ సింగ్ సుక్కు (Sukhvinder Singh Sukhu), ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ (Bhupesh Baghel), కర్ణాటక, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు శివకుమార్, భట్టి విక్రమార్క తదితరులతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక్కడి వాతావరణంలో ఆశ, ఉత్సాహం, ఉత్సుకత స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు. ఇక్కడున్న అందరి ఉమ్మడి లక్ష్యం రాహుల్‌గాంధీని దేశానికి ప్రధాన మంత్రిని చేయడమేనని వెల్లడించారు. ప్రధాన మంత్రిగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం అందరం కలిసి కట్టుగా, ఇదే ఉత్సాహంతో పని చేస్తామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి






