అలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలి : మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలోని భవనాల విభాగానికి చెందిన చీఫ్ ఇంజినీర్ ఆదివారం ఒక వార్తకు సంబంధించి ఖండన లేఖను విడుదల చేశారు. అందులో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ (Telangana) అని ఉండాల్సిన స్థానంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అనే పేరు ఉండడం చర్చకు దారితీసింది. సంబంధిత అధికారిపై శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలని అధికారిని ఆదేశించినట్టు తెలిసింది. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని సూచించినట్టు సమాచారం. మంత్రి ఆగ్రహంతో ఆ విభాగం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ (Government of Telangana) పేరుతో మరో లేఖ విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి






