19th May 2026

____________

- Saidulu

చర్మం డ్రైగా మారడానికి రోజూ చేసే తప్పులు

చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే రోజువారీ అలవాట్లు చాలా ముఖ్యమైనవి. తెలియక చేసే కొన్ని చిన్న తప్పుల వల్లే చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా మారుతుంది.

రోజుకు చాలా సార్లు ముఖం కడగడం వల్ల చర్మంలోని సహజ తేమ తగ్గిపోతుంది. దీంతో స్కిన్ డ్రైగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం కూడా చర్మానికి మంచిది కాదు. ఇది స్కిన్‌లోని నేచురల్ ఆయిల్స్‌ను తొలగిస్తుంది.

నీళ్లు తక్కువగా తాగేవారిలో చర్మం త్వరగా పొడిబారుతుంది. శరీరానికి తగినంత హైడ్రేషన్ లేకపోతే స్కిన్ కాంతి కోల్పోతుంది.

మాయిశ్చరైజర్ వాడకపోవడం వల్ల చర్మం రఫ్‌గా మారుతుంది. ముఖ్యంగా స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ ఉపయోగించడం అవసరం.

ఎయిర్ కండిషనర్ గదుల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల గాలిలో తేమ తగ్గి చర్మం ఎండిపోయినట్లు కనిపిస్తుంది. దీంతో చర్మం బిగుసుకుపోయిన భావన కలుగుతుంది.

కఠినమైన కెమికల్స్ ఉన్న సబ్బులు, ఫేస్‌వాష్‌లు ఎక్కువగా వాడితే స్కిన్ దెబ్బతింటుంది. సున్నితమైన ఉత్పత్తులు ఉపయోగించడం మంచిది.

పండ్లు, కూరగాయలు తక్కువగా తినడం వల్ల కూడా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారం స్కిన్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

సన్‌స్క్రీన్ వాడకుండా ఎండలో తిరగడం వల్ల చర్మం పొడిబారటంతో పాటు ట్యాన్ కూడా అవుతుంది. బయటకు వెళ్లే ముందు స్కిన్ రక్షణ చాలా అవసరం.