రాజస్థాన్ కు డూ ఆర్ డై, ప్లే ఆఫ్ రేసు కష్టమేనా..?
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు రావడంతో ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇందులో భాగంగా ఈరోజు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. హోమ్ టీమ్ రాజస్థాన్ రాయల్స్‌కు ఈ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. రియాన్ పరాగ్(Riyan Parag) నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్న ఆర్ఆర్.. ప్లేఆఫ్స్(Play Offs) రేసులో సజీవంగా ఉండాలంటే లక్నోపై ఖచ్చితంగా గెలవాల్సిందే.
ఇవి కూడా చదవండి
మరోవైపు, రిషభ్ పంత్(Rishab Pant) సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటికే టోర్నమెంట్ నుండి అధికారికంగా ఎలిమినేట్ అయిపోయింది. అయితే, గత మ్యాచ్‌లో సీఎస్కేను ఓడించి మంచి ఊపుమీదున్న లక్నో.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను కూడా ఓడించి వారి ప్లేఆఫ్స్ ఆశలను దెబ్బతీసే ‘స్పాయిలర్’గా మారాలని ప్లాన్ చేస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డులను పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్‌దే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది.
ఇప్పటివరకు ఇరు జట్లు 7 సార్లు ముఖాముఖి తలపడగా.. రాజస్థాన్ 5 మ్యాచుల్లో, లక్నో కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించాయి. పైగా ఈ సీజన్ లోనే ఏప్రిల్ 22న లక్నో వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జైపూర్ పిచ్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. లక్నో బౌలింగ్ బలంగా ఉన్న నేపధ్యంలో రాజస్థాన్ బ్యాటర్లు కష్టపడాల్సిందే.
ఇవి కూడా చదవండి






