జూన్ 28న మిన్నసోటాలో ‘టీమ్’ వనభోజనాలు
TEAM: అమెరికాలోని తెలుగు లోగిళ్లలో పండుగ వాతావరణం నెలకొనబోతోంది. మిన్నసోటా తెలుగు సంఘం (TEAM) ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘సమ్మర్ పిక్నిక్’ (వనభోజనాలు) ఈ ఏడాది జూన్ 28న నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. గత దశాబ్ద కాలంగా కుటుంబ అనుబంధాలను బలోపేతం చేస్తూ వస్తున్న ఈ సాంప్రదాయ వేడుకకు బ్లూమింగ్టన్ లోని హైలాండ్ లేక్ పార్క్ రిజర్వ్ వేదిక కానుంది.
వివరాలు..
- తేదీ: ఆదివారం, జూన్ 28, 2026
- సమయం: ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు
- వేదిక: Sunnyside Picnic Area, Hyland Lake Park Reserve, 10145 E Bush Lake Rd, Bloomington, MN 55438.
విశేషాలు..
తెలుగు కమ్యూనిటీ సభ్యులందరికీ ఈ ప్రవేశం పూర్తిగా ఉచితం. వచ్చిన అతిథులకు నోరూరించే విందు భోజనంతో పాటు, పిల్లలకు , పెద్దలకు ప్రత్యేకంగా ఆటల పోటీలు (Bingo వంటివి), వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కొత్త పరిచయాలకు, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఈ వేదిక ఒక చక్కని అవకాశమని నిర్వాహకులు తెలిపారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ వేడుకలో పాల్గొనాలనుకునే వారు గూగుల్ ఫామ్ ద్వారా ముందుగానే రిజిస్ట్రేషన్ (RSVP) చేసుకోవాలని టీమ్ (TEAM) ప్రతినిధులు కోరారు. మీ కుటుంబంతో కలిసి వచ్చి, ఈ వేసవి వనభోజనాలను విజయవంతం చేయాలని వారు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.






