బుల్లెట్ వేగంతో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు
బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield) ప్రాజెక్టు ఏర్పాటు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ సీఈవో గోవింద రాజన్ (Govinda Rajan) సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి, ఉత్పత్తి ప్రారంభించాలని తేల్చిచెప్పారు. దీనికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లా (Tirupati District) సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు వద్ద రూ.2500 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక తయారీ యూనిట్‌తోపాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధన కేంద్రం, వెండార్ పార్క్ ఎకో సిస్టమ్ కూడా నిర్మిస్తామని గోవిందరాజన్ చెప్పారు. ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
ఇవి కూడా చదవండి






